Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • అరగంటలోనే తిరిగి ల్యాండ్ చేసిన పైలట్లు
  • సాంకేతిక లోపంతో అత్యవసర నిర్ణయం
  • ప్రయాణికులంతా సురక్షితం
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు ఫోకస్
Indigo Flight

Indigo Flight

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. విమానం టేకాఫ్‌ అయిన కేవలం అరగంట వ్యవధిలోనే పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా వెంటనే అప్రమత్తమై, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు ధృవీకరించారు. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.