Hyderabad On Wheels: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను ఫోటోగ్రఫీ ద్వారా వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘హైదరాబాద్ ఆన్ వీల్స్’ బస్సులో పులుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గుతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సామాజిక బాధ్యతగా ఈ పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను వివరించనున్నారు. ఈ ప్రదర్శనలో, TSRTC ICBM-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ డీన్ (అకడమిక్స్) వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ప్రొఫెసర్ జితేందర్ గోవిందనీ తీసిన పులి ఫోటోలను ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ ఆవరణలో ‘హైదరాబాద్ ఆన్ వీల్స్’ బస్సులో పులి ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) రాకేష్ మోహన్ డోబ్రియాల్, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సంయుక్తంగా ప్రారంభించారు.
Read also: Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్ (ఐపిఎఫ్), ఐసిబిఎం-స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ సహకారంతో టిఎస్‌ఆర్‌టిసి నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో పులుల ఛాయాచిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పులుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో పులుల ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు రాకేష్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు. తెలంగాణ అటవీశాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రెండు పులుల సంరక్షణ కేంద్రాల్లో దాదాపు 30 పులులు ఉన్నట్లు చెబుతున్నారు. అడవుల్లో నివసించే పులుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని సమస్త జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నట్లు వివరించారు.
Read also: Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం
పులులను రక్షించడం అంటే అడవులను, వాటి జీవితాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడడమేనని అన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో తాను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవవైవిధ్యానికి మూలాధారమైన పులులను సంరక్షించడం అందరి బాధ్యత అని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. పులులను సంరక్షించడం పర్యావరణాన్ని పరిరక్షించినట్లే అన్నారు. పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ సంస్థ సహకారంతో టీఎస్ఆర్టీసీ ‘హైదరాబాద్ ఆన్ వీల్స్ ’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ఎఫెక్టివ్ మీడియా అని.. ఫోటోలు, విజువల్స్ ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని అన్నారు. మాటల ద్వారా వ్యక్తీకరించలేని భావాలను ఫోటోలు తెలియజేస్తాయని వివరించారు. ఈ ఫొటోగ్రఫీ ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి ప్రజా రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ అని తెలిపారు.
Akash-Shloka Ambani: అంబానీ మనుమరాలి పేరేంటో తెలుసా?