Site icon NTV Telugu

Indecent Behavior with Female Patient: వైద్యం కోసం వెళ్తే పాడు పని… ప్రముఖ వైద్యుడికి పదేళ్ల జైలు

Indecent Behavior With Female Patient

Indecent Behavior With Female Patient

indecent behavior with female patient doctor ten years in jail: ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు నాంపల్లి కోర్టు 10 సంవత్సరాలు జైల్ శిక్ష విధించింది. 2016 లో తన క్లినిక్ కు ఒచ్చిన ఒ మహిళా పేషంట్ పై అసభ్యంగా ప్రవర్తించాడని, వైద్యం కోసం వెళ్లిన ఆమెపై అసభ్య ప్రవర్తన చేసాడని బాధితురాలు 2016 లో గోపాలపురం పోలీస్ లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆధారాలు పోలీసులు సమర్పించారు. దీంతో.. ప్రముఖ పల్మనాలజీస్ట్ విజయ్ భాస్కర్ కు 10 సంవత్సరాల జైల్ శిక్ష తో పాటు 5 వేలు జరిమానా విధించింది నాంపల్లి కోర్టు.

read also: Nitish Kumar Swearing-In Ceremony As CM Live: సీఎంగా నితీష్‌ ప్రమాణస్వీకారం

వివరాల్లోకి వెళితే.. 2016, మే 13న సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌ కు వెల్లగా డాక్టర్ల పరీక్షించిన మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర్‌ చెస్ట్‌ క్లినిక్‌ రిఫర్‌ చేశారు. దీంతో అక్కడ వున్న డాక్టర్‌ విజయభాస్కర్‌ వైద్య పరీక్షల పేరుతో గదిలోకి తీసుకెళ్లి మహిళ ప్రైవేట్‌ పార్టులను తాకాడు. ఎందుకు ఇలా తాకుతున్నారు అని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షలో భాగంగానే చేస్తున్నానని నమ్మబలికాడు. దీంతో బయటకు వచ్చిన ఆమె మందులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే ఏడాది జులైలో ఆమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడ మరోసారి ఊపిరి తిత్తుల సంబంధించిన సమస్య మళ్లీ తలెత్తడంతో.. తిరిగి సెప్టెంబర్‌లో సీటికి వచ్చి తన తల్లి తో కలిసి డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ ను సంప్రదించగా వైద్య పరీక్షల పేరుతో గతంలో మాదిరిగా అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో సందరు యువతి బంధువులతో కలిసి డాక్టర్‌ విజయభాస్కర్‌ తో గొడవకు దిగింది. చకప్‌ చేస్తా అంటూ రూం లో తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. 2016 అక్టోబర్‌ 8న కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌కుమార్ ను అదుపులో తీసుకున్నారు. ఈకేసుపై 2022 ఆగస్టు9న విచారించిన నాంపల్లి సెషన్స్‌ కోర్టు జడ్జి కె.కవిత డాక్టర్‌ విజయ్‌కుమార్ ను 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
Jagananna Vidya Deevena: మరో గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లోకి డబ్బులు

Exit mobile version