House Rates: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
House Rates: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది నానుడి.. అంటే పెళ్లి చేయాలన్నా.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అని అన్నారు. ఇవాళా, రేపు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉండాలనే అనుకుంటారు. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న సొంతింటి కల హైదరాబాద్‌లో నెరవేరాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇపుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సొంతిల్లు కావాలంటే కనీసంగా కోటి కంటే ఎక్కువ ఉండాల్సిందే..
Read also: Bihar: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కాసేపటికే కన్నుమూత
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ వ్యయాలు ఎక్కువ కావడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్లు, ప్లాట్ల ధరలు పెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇండియాలోని జనవరి- మార్చిలో 8 నగరాల్లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగినట్టు క్రెడాయ్-కోలియర్స్, లియోసెస్ ఫోరాస్ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో 16 శాతం పెరగగా.. కోల్‌కతాలో 15 శాతం పెరిగాయి. అదే బెంగళూరులో 14 శాతం పెరగగా.. హైదరాబాద్‌లో 13 శాతం పెరిగాయి. ఇవి కాకుండా అహ్మదాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 4 శాతం, పుణెలో 11 శాతం పెరిగాయని తెలిపింది. అయితే ఇన్ని నగరాల్లో ధరలు పెరిగితే ముంబయిలో మాత్రం 2 శాతం తగ్గినట్టు నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర రూ. 10,410లకు చేరిందని నివేదికలో పేర్కొంది.
Read also: Animal : ఎనిమల్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
కొన్ని నగరాల్లో నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో నిర్మాణదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణాలు చేపట్టిన సంస్థలు నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న గిరాకీతో ప్రయోజనం పొందాలని డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీంతో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్యా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే హైదాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 38 శాతం పెరిగిందని కోలియర్స్ ఇండియా తెలిపింది.
- Tags
- Cities
- construction
- house
- prices
- Rates
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!