NTV Telugu Site icon

House Rates: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు

House Rates

House Rates

House Rates: పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది నానుడి.. అంటే పెళ్లి చేయాలన్నా.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అని అన్నారు. ఇవాళా, రేపు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉండాలనే అనుకుంటారు. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న సొంతింటి కల హైదరాబాద్‌లో నెరవేరాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇపుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సొంతిల్లు కావాలంటే కనీసంగా కోటి కంటే ఎక్కువ ఉండాల్సిందే..

Read also: Bihar: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కాసేపటికే కన్నుమూత

నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ వ్యయాలు ఎక్కువ కావడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్లు, ప్లాట్ల ధరలు పెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇండియాలోని జనవరి- మార్చిలో 8 నగరాల్లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగినట్టు క్రెడాయ్‌-కోలియర్స్, లియోసెస్‌ ఫోరాస్‌ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో 16 శాతం పెరగగా.. కోల్‌కతాలో 15 శాతం పెరిగాయి. అదే బెంగళూరులో 14 శాతం పెరగగా.. హైదరాబాద్‌లో 13 శాతం పెరిగాయి. ఇవి కాకుండా అహ్మదాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 4 శాతం, పుణెలో 11 శాతం పెరిగాయని తెలిపింది. అయితే ఇన్ని నగరాల్లో ధరలు పెరిగితే ముంబయిలో మాత్రం 2 శాతం తగ్గినట్టు నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర రూ. 10,410లకు చేరిందని నివేదికలో పేర్కొంది.

Read also: Animal : ఎనిమల్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

కొన్ని నగరాల్లో నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో నిర్మాణదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణాలు చేపట్టిన సంస్థలు నిర్మించిన ఇళ్లు అమ్ముడు పోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న గిరాకీతో ప్రయోజనం పొందాలని డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీంతో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్యా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే హైదాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 38 శాతం పెరిగిందని కోలియర్స్ ఇండియా తెలిపింది.