Site icon NTV Telugu

IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ

It Rides In Aditya Homes

It Rides In Aditya Homes

IT Rides in Aditya Homes: హైదరాబాద్‌ లో శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడవరోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత, ట్రెడెంట్‌ ప్రాపర్టీస్‌ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఐటీ అధికారులపై ఆదిత్య హోమ్స్ సిబ్బంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐటీ అధికారుల పై ఎండీ కోటా రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు అకౌంట్ ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా ఆదిత్య హోమ్స్ పై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని. శ్రీ ఆదిత్య హోమ్స్ కార్యాలయానికి చేరుకోనున్న ఐటీ శాఖ ఉన్నత అధికారుల బృందం చేరుకుని సోదాలు నిర్వహించనున్నారు. అయితే ఐటి సోదాలు జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారం చేసిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని ఐటి అధికారులు హెచ్చరించారు. ఐటి అధికారులు వేధిస్తున్నారని శ్రీ ఆదిత్య హోమ్స్ సిబ్బందిపై బయటకి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటి అధికారులకు శ్రీ ఆదిత్య హోమ్స్ అకౌంట్ సిబ్బంది సహకరించడం లేదని అంటున్నారు. అధికారుల సోదాలకు శ్రీ ఆదిత్య హోమ్స్ అకౌట్స్ సిబ్బంది సహకరించకపోవడంతో మరింత ఆలస్యం అవుతుందని తెలుపుతున్నారు.

Read also: GVL Narasimha Rao: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ధీటుగా బీజేపీ పరుగులు.. బీఆర్‌ఎస్‌కు వీఆర్ఎస్సే..

జనవరి 18 నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య, సీఎస్‌కే, ఉర్జిత, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్లాట్ల వివరాల్లో అక్రమాలున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆదిత్య రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాలతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పాత్రలు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్స్, అకౌంట్స్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీలు చేపట్టిన వెంచర్స్, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వివరాలు అరా తీస్తున్నారు. ఐటీ సిబ్బంది విచారణకు అకౌంట్ సిబ్బంది సహకరించపోవడం.. కొన్ని కార్యాలయాలలో దాడులకు వచ్చినప్పుడు అకౌంట్స్ సిబ్బంది కనిపించక పోవడంపై పలు అనుమానాలు వక్తం చేశారు. మరికొన్ని కార్యాలయాల్లో అకౌంట్ సిబ్బందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. అకౌంట్స్ సిబ్బంది నుండి బ్యాంక్ ట్రాన్స్‌యాక్షన్స్ వివరాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు రియల్ ఏస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయపన్నుకు సంబంధించి అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు.. ఆయా రియల్ ఏస్టేట్ సంస్థలు విక్రయించిన ప్లాట్ల విక్రయాల గురించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఐటీ అధికారుల అకౌంట్ టెంట్ల పై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై ఐటీ అధికారులు తీవ్రంగా స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి

Exit mobile version