Site icon NTV Telugu

హెటిరో డ్రగ్స్: ఐటీ దాడుల్లో భారీగా నగదు సీజ్

హెటిరో డ్రగ్స్‌ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్‌ ఇళ్లతో పాటు కార్పొరేట్‌ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత అనేదానిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్‌ ఇళ్లలో సోదాలు ముగిసాయి. మరోవైపు.. భారీ ఎత్తున నగదు దొరకడంతో కంగుతిన్న అధికారులు.. దానిపై హెటిరో అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.. రేపు కూడా రెండు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగనున్నట్టు చెబుతున్నారు అధికారులు.

Exit mobile version