సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై బల్మూరి వెంకట్ మాట్లాడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క యువతులపై రేప్ సంఘటనలు జరుగుతుంటే మరో పక్క తెల్లవారే దాక పబ్బులను నడుపుతు యువతి, యువకుల ప్రాణలతో చలగాటం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ లు మద్యం సేవించడం ఆధారాలతో సహా యాజమాన్యం ముందు పెట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేవలం ప్రయాణికులకు మాత్రమే పబ్ లోకి అనుమతించాలి తప్ప బయటవ్యక్తులను కాదని మండిపడ్డారు. మూడు రోజుల క్రితం యువతిపై మద్యం మత్తులో అత్యాచారం జరిగిన విషయం తెలిసి కూడా తెల్లావారుజాము వరకు పబ్ లను నడుపుతూ యువతను చెడు మార్గంలో పెడుతున్నారని నిప్పులు చెరిగారు. సంబంధిత శాఖ మంత్రులు, కెటిఆర్ ఎయిర్ పోర్ట్ లోని మూడు పబ్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పబ్ యాజమాన్యాలపై సంబంధిత శాఖ మంత్రులు, కెటిఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
