NTV Telugu Site icon

Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు

Inavolu Mallanna Jatara

Inavolu Mallanna Jatara

Inavolu Mallanna Jatara: వరంగల్ జిల్లాలో నేటి నుంచి ఐనవోలు జాతర మొదలు కానుంది. ఐనవోలు మల్లిఖార్జున స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధం చేసిన అర్చకులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో మొదలవున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణ రోజు స్వామివారికి నూతన వస్త్రాలంకరణతోపాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇక్కడ మహాశివుడి రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం మల్లికార్జునుడు సహా పలు క్షేత్రాల్లో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. కానీ, ఇక్కడ విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. దీంతో.. మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేలు రాయుడు పిలుచుకునే.. మైలారుదేవుడి రూపం పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో అలరారుతుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. అంతేకాకుండా.. కుడి పాదం కింద, మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి మల్లాసురుల శిరస్సులు ఉంటాయి. అయితే.. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్రతో అంతకుమించిన విశిష్టమైన కళా సంపద ఆలయం సొంతం. ఇక్కడి అష్టోత్తర స్తంభాలు, కాకతీయ కళా సంపద కీర్తితోరణలతో గ్రామం స్వాగతం పలుకుతుంది. పుట్టుమన్నుతో పూజలు మల్లికార్జునస్వామి పూజలందుకుంటారు.

Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్

అయితే.. సంక్రాంతికి ముందు నుంచి ఉగాది వరు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహ్మోత్సవాల వేడుకల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, పట్నాలు, బోనాలతో సందడిగా కనిపిస్తుంది. జనవరి 14న శనివారం భోగి పండుగ, 15న ఆదివారం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, ఇక.. 17న మహా సంప్రోక్ష సమారాధన పూజలు జరుగనున్నాయి. జనవరి 26న భ్రమరాంబ అమ్మవారి నవమి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ఆదివారం ఎల్లమ్మ పండుగ జరుగనున్నది. శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 22 వరకు పంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా పలు వాహనసేవలు నిర్వహించనున్నారు. 18న శనివారం శివరాత్రి రోజున కల్యాణం, పెద్దపట్నం, సింహవాహనసేవ, రాత్రి 7 గంటలకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం జరుగనున్నది. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాఫీగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో వుండేలా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
Warangal Crime: మద్యం మత్తులో యువకుల హల్‌చల్.. అర్ధరాత్రి రోడ్డుపైనే చితకొట్టుకున్న..

Show comments