నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారుతోంది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్‌చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. జులై 21న డ్రంక్ డైవ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదిని దిగిన ఘటన మరువకముందే నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్నరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టిచారు. తమ హోటల్ లో గొడవ పడకూడదు అని చెప్పిన కారణానికి హోటల్ సామాగ్రి ధ్వంసం చేసి హోటల్ సిబ్బంది పై దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాపారాయుడు నగర్ లోని కె.వి.టిఫిన్స్ సెంటర్ ఎదురుగా గురువారం రాత్రి సతీష్ అనే వ్యక్తితో ఐదుగురు తాగుబోతులు గొడవకు దిగారు. గొడవ పడుతూ టిఫిన్స్ సెంటర్ లోకి ప్రవేశించటంతో, వారిని లోనికి రాకూడదని, టిఫిన్ సెంటర్ నుండి బయటకు వెళ్లాలంటూ కోరిన హోటల్ యజమాని కృష్ణ కోరాడు. తమను బయటకు వెళ్ళమన్నాడన్న కోపంతో, మద్యం మత్తులో హోటల్ లోని సామాగ్రిని ధ్వసం చేసారు. నిలువరించేందుకు ప్రయత్నించిన హోటల్ యజమాని కృష్ణ, సిబ్బంది ముగ్గురి పై దాడి చేశారు. ఎదురు తిరిగిన హోటల్ సిబ్బంది పోలీసులకి సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన మందుబాబులలో నలుగురు పారిపోగా, కిషన్ అనే ఒక్కడు పోలీసుల చేతికి చిక్కాడు. హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో, కిషన్ ను పోలీస్ స్టేషనుకు తరలించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
read also: Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం
జులై 21న పాతబస్తీ మీర్ చౌక్ లో మరో మందు బాబు హల్చల్ చేసాడు. పాతబస్తీ మీర్ చౌక్ లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి టూ వీలర్ నడిపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. మందుబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. పోలీసుల ఎదుటే ప్యాంట్ విప్పి కొట్టారని నడి రోడ్డు పై హల్చల్ చేసాడు. మందు బాబును నచ్చచెప్పేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించిన ససేమిరా అన్నాడు. చివరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారి కుటుంబం సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. అయితే వారాంతాల్లో ఎక్కువగా కనిపించే మందు బాబులు ఇటీవల వీక్ డేస్ లోనూ రచ్చ చేస్తుండడంతో నగరంలో మందుబాబుల హల్‌చల్ సంచలంగా మారింది.
