Site icon NTV Telugu

ఆగస్టు 16 నుంచి దళిత బంధు పథకం అమలు

KCR

KCR

నిన్న ప్రగతి భవన్‌ లో తెలంగాణ కేబినెట్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది.

Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు…

దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సిఎం కెసిఆర్ విశదీకరించారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనీ, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. కాగా.. ఈ దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్‌.

Exit mobile version