NTV Telugu Site icon

Heavy Rains: తెలంగాణలో వర్షబీభత్సం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy Rains

Heavy Rains

Heavy Rains: తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్‌ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్‌ జోన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండురోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో రాగల 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కాస్త పొడి వాతావరణం ఉన్నా మళ్లీ ఇవాళ ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వర్షం ఆగగానే ఆగమాగం బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌లో ఇరుక్కపోవచ్చు. కావున కాస్త చూసుకుని బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలను కోరుతోంది.

 

Show comments