Yellow Alert: రానున్న 4 రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yellow Alert: నైరుతి రుతుపవనాల విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నగరవాసులు ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్ర, కర్ణాటకల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read also: Ap Capital : ప్రమాణస్వీకారం చేయకముందే రాజధాని పనులు ప్రారంభం!
Also Read
రానున్న నాలుగు రోజులు తెలంగాణ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తడిసి ముద్దయ్యారు. ఇప్పుడు రాబోయే నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మీకు ఏదైనా సమస్య ఎదురైతే అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కాల్ చేయడానికి నంబర్‌లు సెటప్ చేయబడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌తో పాటు 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. యాదాద్రి-భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్ పేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!