NTV Telugu Site icon

Yellow Alert: రానున్న 4 రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు..

Yellow Aret

Yellow Aret

Yellow Alert: నైరుతి రుతుపవనాల విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నగరవాసులు ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్ర, కర్ణాటకల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read also: Ap Capital : ప్రమాణస్వీకారం చేయకముందే రాజధాని పనులు ప్రారంభం!

రానున్న నాలుగు రోజులు తెలంగాణ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తడిసి ముద్దయ్యారు. ఇప్పుడు రాబోయే నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మీకు ఏదైనా సమస్య ఎదురైతే అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కాల్ చేయడానికి నంబర్‌లు సెటప్ చేయబడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌తో పాటు 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. యాదాద్రి-భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్ పేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?