NTV Telugu Site icon

Nirmal: నర్సాపూర్ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన.. భాద్యులపై వేటు

Kgbv College Student

Kgbv College Student

Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరికి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన మౌనిక, వినంతి, ఆరాధ్యలను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ పాఠశాలను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ శనివారం పరిశీలించారు.

సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాంక్‌పై కవర్‌ లేకపోవడంతో వెంటనే బిగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ ట్యాంకు వద్దకు వెళ్లి నీటిని పరిశీలించారు. విద్యార్థులు తాగుతున్న మినరల్‌ వాటర్‌, వంటకు ఉపయోగించే బోర్‌ వాటర్‌ శాంపిల్స్‌ సేకరించారు. మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీణలను ఆదేశించారు.

Read also: Haryana: ఘోరం.. శ్మశానం గోడ కూలి నలుగురి మృతి.. వీడియో వైరల్

ముగ్గురిపై వేటు..

నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనకు కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. విధులలో నిర్లక్ష్యం, ఘటనకు బాధ్యులు అయిన విద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సహాయ వంట మనుషుల తొలగించినట్లు వెల్లడించారు. ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యా శాఖా కార్యాలయం లో పని చేస్తున్న జెండర్ కోఆర్డినేటర్ ను మాతృ శాఖకు రిలీవ్ చేశామని, మూడవ తేదీన జరిగిన ఘటనకు బాధ్యులుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, ప్రధాన వంట మనిషిని టెర్మినేట్ చేసామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జ్యోతి, అనూష, ఉమ సహాయక వంట మనుషులను విధుల నుంచి తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నర్సాపూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు అందించారు. ఇక నుంచి కేజీబీవీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు పలువురు అధికారులను తాత్కాలికంగా నియమించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?