బహుళ అంతస్తుల కట్టడాలపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎండీఏ ఫోకస్ పెట్టింది. బుధవారం మరో పది అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో 33 నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం కూల్చి వేసింది.మూడో రోజు తూంకుంట, మణి కొండ, శంషాబాద్, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలలో కొనసాగిన కూల్చివేతలు. అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఎ యంత్రాంగం వేగాన్ని పెంచింది. ఇప్పటికే 600 గజాల మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
Read Also: ప్రభుత్వం ఉద్యోగుల ఊసురు పోసుకుంటుంది : సీతక్క
వీటితో పాటు మరో 10 అక్రమ భవనాలను కూల్చి వేశారు. మూడు రోజుల్లో 33 అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి.తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఐదు (5) అక్రమ నిర్మాణాలపై, మణి కొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు (2), శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు (2), పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి (1) చొప్పున అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. బుధవారం నాటి కూల్చివేత చర్యల్లో తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు అక్రమ నిర్మాణాలతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన అక్రమ నిర్మాణాలు కూల్చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
