హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. లక్షల్లో బెట్టింగ్ పెట్టి కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కోడి పందాలపై దాడి చేసి 20 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను ఆరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సహా మరికొంత మంది ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులను చూసి చింతమనేని ప్రభాకర్‌తో పాటు పలువురు పరారైనట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పటాన్‌చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగతున్నాయి.
Car Accident : యువతిని ఢీకొట్టిన కారు.. కానీ..
ఈ దాడిలో భారీగా నగదు, కోళ్లు స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెదకంజర్ల గ్రామంలో ఓతోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారని, గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ. 13,12,140 నగదుతో పాటు.. 26 వాహనాలు, 32 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.