Site icon NTV Telugu

Gold seized: హైదరాబాద్ కు కిలోల కొద్దీ అక్రమ బంగారం.. కిలాడిని పట్టుకున్న కస్టమ్స్‌

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు, మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఆధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సిని ఫక్కీలో ఇప్పటికి కిలోల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. బంగారం కేటుగాళ్లు తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సినీ ఫక్కీలో కిలోన్నర కు పైగా బంగారం పట్టుబడింది.

Read also: South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే

దుబాయ్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కేరళ ప్రయాణికుడు బంగారాన్ని పొడిగా తయారుచేసి తరలిస్థూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కస్టమ్స్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1761 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు‌. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితున్ని విచారణ చేపట్టారు. దుబాయ్ నుంచి తరలించే ముందు అక్కడ ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందని ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు వున్నారు? హైదరాబాద్‌ లో ఎవరెవరితో నిందితుడు కాంటాక్ట్‌ లో వున్నాడో దర్యాప్తు చేస్తున్నారు.
Mrunal Thakur: ఎర్ర తివాచీపై తెల్లని దుస్తుల్లో మెరిసిపోతున్న మృణాల్

Exit mobile version