Site icon NTV Telugu

Chicken Waste Racket : చికెన్ వ్యర్థాల మాఫియా బాగోతం..!

Chicken

Chicken

Chicken Waste Racket : హైదరాబాద్‌లో మరో పెద్ద అక్రమ రవాణా రాకెట్ బట్టబయలైంది. అత్తాపూర్‌లోని పౌల్ట్రీ యూనిట్లలో ఏర్పడే కూల్లిన చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్‌కి తరలించకుండా, వాటిని నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, భీమవరం వంటి ప్రాంతాల్లోని చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా పోలీసుల దృష్టికి వచ్చింది. సాధారణంగా శుభ్రపరచి, ప్రాసెస్ చేయడానికి రెండరింగ్ ప్లాంట్‌కు వెళ్లాల్సిన ఈ వ్యర్థాలు, ముఠా లాభాల కోసం అనధికారికంగా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లుతున్నాయి.

YS Jagan Pulivendula Tour: పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌.. రేపటి నుంచి మూడు రోజులు..

ఈ అక్రమ కార్యకలాపాలపై ఒక స్వచ్ఛంద సంస్థ నిఘా పెట్టి, అత్తాపూర్ పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరిన అనుమానాస్పద లారీలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. చికెన్ వ్యర్థాలతో నిండిన లారీలను ఆపి పరిశీలించగా, వాటిని అనుమతి లేకుండా, ఎలాంటి హైజీన్ నిబంధనలు పాటించకుండా తరలిస్తున్నట్లు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యర్థాలను చేపల ఫీడ్ తయారీలో ఉపయోగించేందుకు కొంతమంది వ్యాపారులు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ముఠా సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు తెలియకుండా ఈ వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో మరెవరెవరు ప్రమేయం ఉన్నారన్నదానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Gold Reserves: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు ఇవే..

Exit mobile version