Site icon NTV Telugu

రెండేళ్లుగా ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు: జగ్గారెడ్డి

గడిచిన రెండేళ్లలో రాష్ర్టంలోని ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ర్టంలో ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు. నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టినందుకు వారిని గౌరవిస్తున్నారన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, దామోదర్, గీత రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బ్లాక్‌ మెయిల్‌ చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుందని ఆయన మండిపడ్డారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 230 ఓట్లలో 50 ఓట్లు టీఆరెస్ పార్టీకి పడతాయని భావిస్తుందని కానీ మాకు 230 వస్తాయన్న నమ్మకం ఉందని జగ్గారెడ్డి చెప్పారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఉన్న 230 కి ఒక్క ఓటు తగ్గిన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజీనామా చేసి కేవలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని జగ్గారరెడ్డి అన్నారు.

Exit mobile version