DK Aruna: జైలుకి వెళితే అవినీతిపై వెళతారు.. ప్రజలకోసం పోరాటమని చెప్పడం విడ్డూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna V/s Kavitha: ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇవాళ డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందనే వాదనతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. మోడీ ముందు ఈడీ వచ్చిందని ఎద్దేవ చేశారు. అరెస్ట్ లు చేస్తే చేయండి జైలుకు పోయేందుకు సిద్దమే అంటూ ప్రస్తావించారు కవిత. అయితే ఈ వ్యాఖ్యలపై డీకే అరుణ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల పోతుంది, అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి పోయేందుకు సిద్ధం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా వుందని ఎద్దేవ చేశారు.
మీరు చేసిన తప్పులు బయటపడుతాయనే ముందుకు ముందే బీజేపీ పై ఎదురు దాడి ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుందని అన్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయం ఎందుకు? అంటూ డీకె అరుణ ప్రశ్నించారు.
read also: Kantara: 400 కోట్లు రాబట్టిన సినిమా అక్కడ సౌండ్ చెయ్యట్లేదేంటి?
Also Read
ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. జై తెలంగాణ అనే నినాదంతో మీడియాతో ఆమె మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందని అన్నారు. మోడీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ అని ఆరోపించారు. మోడీ వచ్చే ముందు ED రావడం సహజమని కొట్టి పారేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ED కేసులు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. రాజకీయమైన ఎత్తుగడలో భాగంగానే ED కేసులని కవిత పేర్కొన్నారు. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతియ్యడానికే మీడియా లీకులు అంటూ మండిపడ్డారు. జైల్లో పెడతాం అంటే బయపడం…జైల్లో పెడుతే ఏం అవుతుంది.
జైల్లో పెట్టి ఉరి వెయ్యరు కదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఛీప్ ట్రిక్ ప్లే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటామన్నారు కవిత. మీరు చేయిస్తున్న ఈడీ, ఐడీ రైట్స్ పై మేము సహకరిస్తాం కానీ.. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మోడీ జీ మీరు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని కవిత ప్రశ్నించిన విషయం తెలిసిందే..
Russia-Ukraine War: ఎలాన్ మస్క్ ఒకసారి వచ్చి ఉక్రెయిన్‌ను చూడు.. నీకే తెలుస్తుంది.. జెలెన్ స్కీ ఆగ్రహం
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!