Icrisat: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ రైతుల పాలిట ఓ వరంలా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సైంటిస్టులు జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ ఎక్స్-రే టెక్నాలజీ (EZRT) పరిశోధకుల సహకారంతో ఎక్స్‌రే రేడియోగ్రఫీని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వేరుశనగల నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తామని సైంటిస్టులు తెలియజేశారు. దీంతో రైతులు నాణ్యమైన పల్లీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఈ మేరకు వాణిజ్యపరంగా క్వాలిటీ పల్లీలను అందించేందుకు శాస్త్రవేత్తలు సమర్థవంతమైన నాన్ డిస్ట్రక్టివ్ పద్ధతిని కనుగొన్నారు. ఇందుకోసం ఇక్రిశాట్‌లో వేరుశెనగ పెంపకందారులు సాధారణంగా తీసుకునే సమయంలో కొంత భాగాన్ని వెచ్చిస్తారు. సీజన్‌కు ఉత్తమమైన రకాన్ని ఎంచుకోవడానికి ఒక రోజులో 100 నమూనాలను స్కాన్ చేస్తారు.
Read Also:Sun Colour: సూర్యుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా..? పసుపు రంగు మాత్రం కాదు.
ఎక్స్‌రే ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వ్యవసాయ పరిశోధనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇక్రిశాట్ సైంటిస్ట్ సునీతా చౌదరి అభిప్రాయపడ్డారు. పంట కోత తర్వాత పల్లీల క్వాలిటీని పరీక్షించుకోవచ్చని.. అయితే ఇందుకు పట్టే సమయం ప్రయోగశాలలో ఉండే ఫెసిలిటీస్‌ను బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఈ పద్ధతి వాణిజ్య రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందవచ్చన్నారు. వేరుశనగలో షెల్లింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా మరింత దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ పద్ధతిని సాధారణ మార్కెట్ యార్డులలో కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని రైతులు తమ కష్టార్జిత ప్రయోజనాలను పొందలేకపోతున్నారని.. అందువల్ల ఇక్రిశాట్ పరిశోధకులు లాభదాయక పంటలను ఎంచుకుని వాటి ఉత్పత్తిలో ఎదురయ్యే అవాంతరాలను ఎత్తి చూపిస్తూ మెరుగైన ఆదాయం పొందేలా చర్యలు చేపట్టారని ఈజెడ్ఆర్‌టీ విభాగాధిపతి స్టీపెన్ గెర్త్ వ్యాఖ్యానించారు. సాంకేతికతను ఉపయోగించి పంటలోని అవాంతరాలను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా వేరుశనగలను షెల్ నుంచి వేరుచేయడానికి చాలా సమయం పడుతుందని.. ఇది శ్రమతో కూడుకున్నదని.. నైపుణ్యం కలిగిన కార్మికులకు 30 నిమిషాలు పట్టేదని.. అయితే ఒక టెక్నీషియన్ సాంకేతికతను ఉపయోగించి రెండు నిమిషాల్లో పూర్తి చేయగలడని తెలిపారు.
