Additional CP Srinivas Interview : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన తర్వాత, అసలు సినీ పరిశ్రమలో పైరసీ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా అనే అంశంపై హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కీలక విషయాలను వెల్లడించారు. తాము ఈ కేసును ఛేదించినప్పటికీ, పైరసీపై ఇంకా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘ఐ-బొమ్మ రవిని పట్టుకుంటే పైరసీ మొత్తం ఆగిపోతుందని అనుకోవచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కమిషనర్ స్పందిస్తూ… “ఐ-బొమ్మ అనేది సముద్రంలో ఒక బిందువు మాత్రమే” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు అయినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, ఇంకా చాలా మంది వ్యక్తులు, సంస్థలు ఈ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో పోలీసులు అనుసరించిన విధానాన్ని వివరిస్తూ.. తమ పని చట్టపరమైన చర్యలు తీసుకోవడం వరకేనని, ఇది ఇల్లీగల్ అని నిర్ధారించడం, ఏ సెక్షన్‌లు అప్లై అవుతున్నాయో చూడటం, ప్రాసిక్యూషన్ (న్యాయ విచారణ)కు అవసరమైన అంశాలను బలంగా సమర్పించడం వరకే పరిమితమని తెలిపారు. పైరసీ అనేది రూపాయి విలువైనది కావచ్చు, 100 కోట్ల విలువైనది కావచ్చు, ఇల్లీగల్ అన్నప్పుడు ఇల్లీగల్ అంతే అని స్పష్టం చేశారు. అయితే, కొంతమంది పబ్లిక్, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఈ ఫ్రీ కంటెంట్ లభించడం వలన నిందితుడిని ‘హీరో’గా చిత్రీకరిస్తున్నారని, ఇల్లీగల్ అంశాలను ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు.
Sushanth–Meenakshi : సుశాంత్‌తో మీనాక్షి పెళ్లి.. ఓపెనైపోయారుగా
ఇంటర్వ్యూలో ‘మూవీ రూల్స్’ వంటి ఇతర పెద్ద పైరసీ వెబ్‌సైట్ల గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై అదనపు సీపీ స్పందిస్తూ… ‘మూవీ రూల్స్’ వంటి సంస్థలు తమిళనాడు నుంచో లేదా ఇతర ప్రాంతాల నుంచో ఆపరేట్ అవుతుండవచ్చు. వీటి వల్ల తెలుగు సినీ పరిశ్రమ నష్టపోతున్న నేపథ్యంలో, ఆయా ఇండస్ట్రీల ప్రతినిధులు కంప్లైంట్ ఇవ్వాలి. వారు ఫిర్యాదు చేస్తే, ఆ లీడ్‌తో తాము కూడా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
అన్ని రకాల క్రైమ్‌లకు టెలిగ్రామ్ (Telegram) ఒక కేంద్రంగా మారుతున్నా, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే ప్రశ్నకు… ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటోందని సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌తో సహా దాదాపు 80 నుంచి 90 చైనీస్ యాప్‌లను ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని ఉదాహరణగా పేర్కొన్నారు.
చివరిగా, పైరసీ చేసే వారికి, చూసే వారికి ఆయన ఇచ్చిన సందేశం ఒకటే.. “పైరసీ మాత్రం ఇట్ ఈజ్ ఇల్లీగల్. పైరసీ చేయొద్దు. పైరసీ చేసిన సినిమాని చూడొద్దు. దట్స్ ఇట్.” అధికారుల అభిప్రాయం ప్రకారం.. ఐ-బొమ్మ రవి అరెస్టుతో పైరసీకి పూర్తి స్థాయిలో ముగింపు పడకపోయినా, ఈ కేసు సినీ పరిశ్రమకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
