IAS Officer Case Update: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ తహసీల్దార్ ఆనందకుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై అక్రమ చొరబాట్లు, అక్రమాస్తుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి ఆనందకుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో సంచలనంగా మారింది.
Read also: Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి వెళ్లారు. అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈఘటన జరిగి రెండు రోజులు తరువాత వెలుగులోకి ఆరవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఒక మహిళా ఐఏఎస్ ఇంటిలోకి ఎలా వెళ్లాడు? సెక్యూరిటీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిసాయి. అయితే దీనిపై స్పందించారు స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి చొరబడినప్పుడు తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టానని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్వీట్ చర్చకు దారితీసింది. తన ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారని తెలిపారు. ఆ రాత్రి తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని చెప్పాడు. తనను తాను రక్షించుకోవడంపైనే తనదృష్టి సారించినట్లు ఆమె ట్వీట్ వేదికగా చెప్పారు.
Read also: IT Raids: శ్రీ ఆదిత్య హోమ్స్ లో ముగిసిన ఐటీ సోదాలు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు
మహిళా ఐఏఎస్ గట్టిగా కేకలు వేయడంతో.. సిబ్బంది వచ్చారని అలా తనను తను రక్షించుకోగలిగానని తెలిపారు. ఏ సమయంలో నైనా సరే ధైర్యం కోల్పోకూడదంటూ ధైర్యంగా ఉండలని సూచించారు స్మితా. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నామని ఆలోచించిన ప్రమాదం ఏ సమయంలో వస్తుందో తెలియదు కావును మీరు ఉంటున్న ఇంటికి ఎల్లప్పుడూ తాలుపులు వేసుకుని ఇంటికి వేసిన తాళాలను పరీక్షించుకోవాలని సూచించారు. మీకు ఎలాంటి అనుమానం వచ్చిన 100 నంబర్‌కు డయల్ చేయాలని స్మితా ట్వీట్ చేయడం వైరల్ అయ్యింది. అయితే ఈ ట్వీట్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని రీ ట్వీట్ చేయడంతో సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై స్పందించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ వేటు వేశారు.
Hair Growth: జుట్టు చివర్లను కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుందా?