Site icon NTV Telugu

Raja Singh: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రాజా సింగ్‌.. సర్జరీ చేసిన వైద్యులు

Raja Singh

Raja Singh

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్పత్రిలో చేరారు.. ఆయనకు సర్జరీ కూడా జరిగింది.. ఈ విషయాన్ని రాజాసింగ్‌ స్వయంగా వెల్లడించారు.. ఇంతకీ రాజాసింగ్‌కు ఏమైంది? సర్జరీ ఏంటి? అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తానంటూ సందేశాన్ని పంపించారు.. ‘జైలు నుండి బయటకు రావడానికి ముందు, నా నుదిటిపై చిన్న గడ్డ ఉంది, దాని కారణంగా నాకు చాలా నొప్పి వచ్చిందని పేర్కొన్న రాజా సింగ్‌.. ఈ రోజు ఆస్పత్రిలో చేరి నేను లిపోమా సర్జరీ చేయించుకున్నాను అని తెలిపారు.. అయితే, సర్జరీ కారణంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని.. నేను అతి త్వరలో నా గోషామహల్ ప్రజల మధ్య ఉంటాను అని వెల్లడించారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.

Read Also: Facebook to make changes: అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి ఫేస్‌బుక్‌లో ఈ మార్పులు

కాగా, వివాదాస్పద వీడియో కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ కూడా నమోదైంది.. ఇక, ఈ నెల 9వ తేదీన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజా సింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఆయనపై ప్రయోగించిన పీడీ యాక్టును కూడా హైకోర్టు ఎత్తివేసింది.. దీంతో.. దాదాపు రెండు నెలల తర్వాతర రాజాసింగ్‌ జైలు నుంచి బయటకు వచ్చారు.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి.. నవంబర్‌ 9వ తేదీ వరకు ఆయన జైలులోనే ఉన్నారు..

అయితే, బీజేపీ.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ బీజేపీలోని సెకండ్ క్యాడర్, హిందుత్వ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా జరిగిన విషయం విదితమే.. కానీ, పేరుకు రాజాసింగ్‌పై సస్పెన్షన్‌.. అన్ని విషయాలు బీజేపీ రాజాసింగ్‌కు అండగా ఉంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఎందుకంటే.. జైలు నుంచి రాజాసింగ్‌ విడుదలైన తర్వాత.. బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు రాజాసింగ్‌కు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతులు విధించడంతో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇక, బెయిల్ మంజూరు చేయడంతోపాటు పీడీయాక్టును ఎత్తివేయడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. మరోసారి మీ సేవకు పాత్రుడ్ని కాబోతున్నానని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫొటోను జైశ్రీరాం అంటూ రాజా సింగ్ పంచుకున్న విషయం విదితమే.

Exit mobile version