Site icon NTV Telugu

KTR Davos Tour: తెలంగాణకు బంపరాఫర్.. ఒకటి కాదు మూడు!

Ktr Davos Tour Investments

Ktr Davos Tour Investments

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతోంది. వరుసగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు హ్యుండై సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో పాటు తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మాస్టర్‌ కార్డ్స్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ ఫ్రోమాన్‌తో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్‌ స్టేట్‌ పార్ట్నర్‌షిప్‌ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్‌ సేవలు అందివ్వడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఇది ఉపకరిస్తుంది. అంతేకాదు.. సైబర్‌క్రైం, డిజిటల్‌ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్‌ తెలంగాణతో కలిసి పని చేయనుంది.

మరోవైపు.. జీఎమ్ఎమ్ పీఫాడ్లర్ కూడా తన గ్లాస్-లైన్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని విస్తరించేందుకు 10 మిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇదివరకే ఈ సంస్థ 2020లో 6.3 మిలియన్ డాలర్లతో తెలంగాణలో పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు రెండేళ్ళ వ్యవధిలో రెట్టింపు పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ ముందుకు రావడం విశేషం.

Exit mobile version