HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- శంషాబాద్‌లో హైడ్రా మెరుపు దాడులు
- ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
- బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల నేలమట్టం
- భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA : హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) అధికారులు తమ ఉక్కుపాదాన్ని కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ ఎత్తున జరిగిన ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అధికారులు శుక్రవారం ఉదయం మెరుపు దాడి చేశారు. ఎయిర్పోర్ట్ కాలనీ పరిసరాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పక్కన ఉన్న సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశారు.
ఈ ఐదెకరాల ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది భూస్వాములు, కేటుగాళ్లు కబ్జా చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలను లేపారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. కూల్చివేతల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా , బాధితుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా మధ్య హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి, సదరు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
హైదరాబాద్ , దాని చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో చెరువులు, నాలాలు, , ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడటమే లక్ష్యంగా హైడ్రా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఎంతటి రాజకీయ పలికుబడి ఉన్నవారైనా సరే, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు మరోసారి స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి హై-ప్రొఫైల్ ఏరియాలో జరిగిన ఈ కూల్చివేతల కలకలం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!