Site icon NTV Telugu

Hyderabad’s Reality Boom: ఇదీ.. హైదరాబాద్ ‘రియల్‌’ డెవలప్‌మెంట్‌.

Hyderabad's Reality Boom

Hyderabad's Reality Boom

Hyderabad’s Reality Boom: హైదరాబాద్‌ మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కరోనా ప్రభావం నుంచి గణనీయంగా కోలుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు (8 నెలల్లోనే) 22 వేల 680 కోట్ల రూపాయల విలువైన 46,078 రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు సేల్‌ అయ్యాయి. ఆగస్టు నెలలో 5,181 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. జులై నెలతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. జులైలో ఆషాఢం వల్ల ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ మాసం వెళ్లే వరకు ఆగి ఆగస్టులో భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. దీంతో ఒక్క నెలలోనే రూ.2,658 కోట్ల విలువైన అమ్మకాలు జరగటం విశేషం.

వివో.. విస్తరణ..

ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్ల సంఖ్యను 650 దాటించాలని స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో విస్తరణ ప్రణాళికను రూపొందించింది. ఈ సంస్థకు ప్రస్తుతం ఇండియాలో 600 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, 20కి పైగా ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లు ఉన్నాయి. ఢిల్లీ-నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లోని గుర్గావ్‌లో తొలి ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను లేటెస్ట్‌గా ఓపెన్‌ చేసింది. ప్రొడక్ట్‌ ఎక్స్‌పీరియెన్స్‌, సేల్స్‌, సర్వీస్‌, యాక్ససరీస్‌ వంటి సేవలన్నింటినీ ఒకే చోటకి చేర్చింది. కస్టమర్లకు రిటైల్‌ స్పేస్‌లోనే ఈ ప్రత్యేక అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ హెడ్‌ యోగేంద్ర శ్రీరాములు తెలిపారు.

ఫ్ల్యాష్‌బ్యాక్‌.. టాలీవుడ్‌లోని కొన్ని హిట్‌ పెయిర్స్‌..

ఫార్మా.. నిపుణుల ధీమా..

ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో అర్ధ భాగంలో ఇండియన్‌ ఫార్మా సంస్థలు ధరల ఒత్తిళ్ల నుంచి కోలుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ సమయంలో మన దేశంలోని ఫార్మా కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. కానీ.. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మార్జిన్లు రాలేదు. అందువల్లే ఈ ఏడాది ప్రధాన సంస్థల షేర్లు ఇన్వెస్టర్లకు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయని ఎక్స్‌పర్ట్‌లు అభిప్రాయపడ్డారు. సరుకు రవాణా కోసం అధికంగా ఖర్చులు చేయాల్సి వస్తోందని, అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్టర్‌ జనరిక్‌ మందుల ధరలు కూడా కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపాయని చెప్పారు.

Exit mobile version