Chakra Siddha: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోకిలాలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద పాల్గొని.. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యుక్త వయసు నుంచి 60, 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రోజుకు 45 నిమిషాలు కేటాయించి యోగ చేస్తే ఎంతో ఆరోగ్యదాయకమన్నారు.
Read Also: Mylavaram Crime: మైలవరం చిన్నారుల హత్య కేసులో ఊహించని ట్విస్ట్..
అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా యోగాను మత జీవితంలో ఒక భాగంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద అన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు కూడా యోగ చేయాలని, యోగ చేయడం వల్ల మహిళలకు వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలను సైతం జయించే అవకాశం ఉందన్నారు. అలాగే, పాఠశాలల్లోనూ ప్రతి రోజు యోగా తరగతులు నిర్వహిస్తే పిల్లలకు ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజ మాట్లాడుతూ.. వృత్తిపరంగా ప్రతి ఒక్కరు ఎంతో బిజీగా ఉండే ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.. అలాంటివారు ప్రతి రోజు యోగా చేస్తే ఆరోగ్య పరంగా వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా యోగా చేయాలని.. ఇది ముందు తరాలకు ఎంతో ఆదర్శప్రాయం అవుతుందని చెప్పుకొచ్చారు.
