* నేడు హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఎమ్మెల్యే దొంతి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం.. కాంతమ్మ పెదకర్మ కార్యక్రమానికి హాజరుకానున్న రేవంత్..
* నేడు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్న మాగంటి సునీత.. 19న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్న సునీత..
* నేడు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం.. ఇప్పటికీ కొనసాగుతున్న అభ్యర్థి ఎంపికపై కసరత్తు..
* నేడు ఉదయం 9.30గంటలకి మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం.. గూగుల్ తో ఒప్పందం, లిక్కర్ కేసులో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న నారా లోకేష్..
* నేడు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేసిన ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ.. వెన్నునొప్పి వైద్యానికి అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు ఏసీబీ కోర్టు ఆదేశాలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన..
* నేడు భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవల పునరుద్ధరణ.. అమెరికాకు పోస్టల్ సర్వీసులు ప్రారంభం.. ఆగస్టు 22న అమెరికాకు నిలిచిన సర్వీసులు..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్.. మధ్యాహ్నం 3గంటలకి కొలంబో వేదికా మ్యాచ్..
