NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, వినోద్, రాజ్యసభ సభ్యులు..

* నేడు డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం.. ఉదయం 10 గంటలకు ఐటీసీ చోళా హోటల్ లో మీటింగ్.. హాజరుకానున్న తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా నేతలు..

* నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుదిచర్లకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పవన్‌.. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతలు తవ్వాలని కార్యాచరణ

* నేడు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు.. ఏపీ వ్యాప్తంగా రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్.. రాత్రి 8.30 గంటలకు ఇళ్లలో లైట్లు ఆపేసి ఎర్త్ అవర్ పాటించాలన్న గవర్నర్..

* నేడు గుంటూరు జైలు నుంచి సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే అవకాశం..

* నేడు సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటన.. కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత..

* నేడు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తుడుం దెబ్బ పిలుపు నిచ్చిన ఆదివాసి హక్కుల పోరాట సమితి.. కోమురం భీమ్ కాలనీలో నివసిస్తున్న ఆదివాసులకు గృహ జ్యోతి పథకం కింద విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్..

* నేడు ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు..

* నేడు బెంగళూరులో ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభ.. సభలో పాల్గొననున్న జేపీ నడ్డా.. పార్టీ సంస్థగత అంశాలపై చర్చించనున్న నడ్డా..

* నేడు కోల్కతా వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్.. తొలి మ్యాచ్లో కోల్కతా వర్సెస్ బెంగళూరు.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్..