BJP Leader Kolanu Shankar: వేలంలో బాలపుర్గణేష్ లడ్డూలు రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎలాగైనా లడ్డూను దక్కించుకోవాలని వేలంలో పాల్గొన్నానని తెలిపారు. అదృష్టవశాత్తూ 2024లో రూ.30,01,000లకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో 31వ సారి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో కొలను శంకర్ రెడ్డి విజేతల జాబితాలో చేరారు. బాలాపూర్ లడ్డూను 2024లో రూ.30,01,000లకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకోవడంతో వేలం పాట చరిత్రలో బాలాపూర్ లడ్డూ ఏడు రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also: Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?
బాలాపూర్ లడ్డూ వేలం పోరుగా కొనసాగింది. వేలం రూ.1016తో ప్రారంభమైంది. 44 వసంతాల గణేష్ వార్షికోత్సవాల్లో భాగంగా గత 30 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి గడచిన 30 ఏళ్లలో లడ్డూ వెలం పాటలో 1,82,51,950 కోట్ల రూపాయలు ఉండగా, అందులో 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ గతేడాది 2023లో జరిగిన వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షల నగదును గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు బహూకరించిన దాసరి దయానంద్ రెడ్డికి గణేష్ ఉత్సవ సమితి తరపున లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును అందజేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి.
Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..