NTV Telugu Site icon

Tarnaka Petrol Bunk:పెట్రోల్ కు బదులుగా నీళ్లు.. వినియోగదారులు అందోళన

Tarnaka Petrol Bunk

Tarnaka Petrol Bunk

Tarnaka Petrol Bunk: పెట్రోల్‌ బంక్‌ లో పెట్రోల్‌ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన దిగిన సంఘటన హైదారబాద్ లోని తార్నాకలో జరిగింది. తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకు లో నీళ్లు రావడంతో ప్రయాణికులు షాక్‌ అయ్యారు. నీళ్లు రావడం ఏంటని బంక్‌ మేనేజర్‌ కు నిలదీయగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంక్‌ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. దీంతో బంక్ మేనేజర్ నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తార్నాక ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

Read also: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?

ఏం జరిగింది..?

తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకులో ఓ ప్రయాణికుడు కారులో ట్యాంక్‌ ఫుల్‌ పెట్రోల్‌ పోయించుకున్నాడు. ఆ తరువాత అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లగానే కారు ఆగిపోయింది. కారులో సమస్య వచ్చిందని ప్రయాణికుడు చెక్‌ చేయగా అవాక్కయ్యాడు. అందులో పెట్రోల్‌ కు బదులుగా నీరు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తార్నాక ఏజెన్సీ హెచ్ పి పెట్రోల్ బంకులో పెట్రోల్‌ పోయించుకున్నామని అక్కడే వెళ్లి అడుగుదామని వెనక్కివచ్చారు. కారును ఆపి అందులో వున్న నీటిని పెట్రోల్‌ బంక్‌ వద్ద బయటకు తీశారు. పైపులో నుండి నీళ్ళు రావడంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేశారు. బంక్‌ మేనేజర్‌ కు పిలిపించి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ వార్త పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.
Rain Alert: తెలంగాణ రాష్ట్రానికి వీడని వర్షాలు.. మరో మూడు రోజుల పాటు వానలే..