బాలీవుడ్ స్టార్ మీరో అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. కానీ, అంతకు ముందే.. అమీర్‌ఖాన్‌ను పాత వివాదాలు వెంటాడుతున్నాయి.. ఇక, ఆ ఫిల్మ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇటీవల ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.. దానిపై స్పందించిన అమీర్‌ఖాన్.. లాల్ సింగ్ చద్ధాపై ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయిన తీరు బాధ కలిగిస్తోంది.. తాను ఇండియాను లైక్ చేయనని కొందరు తమ మనసులో అనుకుంటున్నారని, కానీ, దాంట్లో నిజం లేదని, వాళ్లు ఆలోచిస్తున్న తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. తన ఫిల్మ్‌ను ఎవరూ బాయ్‌కాట్ చేయవద్దు విజ్ఞప్తి చేశారు.. అయితే, తాజాగా, అమీర్‌ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ఆయనపై వచ్చిన వ్యతిరేకతను ప్రస్తావించారు విజయశాంతి..
Read Also: Nancy Pelosi: తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనా హెచ్చరిక బేఖాతరు
బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ… 2015లో అమీర్ ఖాన్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారన్న విజయశాంతి.. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని… ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో అమీర్ అన్నారని గుర్తుచేశారు.. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో… ఇప్పటికీ పొందుతున్నారో… చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుందని హితవు పలికారు.. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు… ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోందని.. ఇందుకు పెద్ద ఉదాహరణ అమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ… వాస్తవమేంటో తెలిసిన ప్రజలు అమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారని పేర్కొన్నారు విజయశాంతి..
ఇక, గతంలో అమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే…ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారన్న ఆమె.. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయని.. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అనే… ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని అమీర్… గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో… ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారని.. దురదృష్టమేంటంటే…. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు… అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నారని.. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలని హితవు పలుకుతూ.. వరుసగా ట్వీట్లు చేశారు విజయశాంతి. కాగా, లాల్ సింగ్ చద్దా ప్రమోషన్ కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లాంటి సౌత్ హీరోలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాములమ్మ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 2, 2022
