NTV Telugu Site icon

V. Hanumantha Rao: రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. కుల గణన పై హనుమంతరావు

V Hanumantha Rao

V Hanumantha Rao

V. Hanumantha Rao: అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు. అమ్మవారికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులవి హనుమంతరావు మాట్లాడుతూ.. బోనాల పండగ మా తెలంగాణ సంస్కృతి అమ్మవారికి చీరా సారెలను సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో అందరిని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుని ఇంటి ఆడపడుచులను అల్లుళ్లను పిలుచుకొని వారికి చక్కని విందు ఇచ్చి మర్యాదగా చూసుకునే సాంప్రదాయమని వి హనుమంతరావు పండగ విశిష్టతను తెలిపారు.

Read also: Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటన..

అంబర్పేట మహంకాళి అమ్మవారి దయతోనే పార్టీలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడని తెలిపారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి వెనుకబడిన తరగతుల ఇబ్బందులను తెలుసుకొని జనాభా ప్రాతిపదికనన కుల గణన చేపడితేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయానిని తమ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే కులగణన చేపడతామని తెలిపారు. అదే సమయంలో ఇది ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా కుల గణన చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమ్మవారి దయతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యావు ఇప్పటికే కుల గణన పై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అదే సమయంలో కుల గణన జరిగిన తర్వాతనే, నగర పాలిక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఒక బీజేపీ పార్టీని మినహాయించుకుంటే అన్ని పార్టీలు కూడా కులగణనకు మద్దతు ఇస్తున్నాయన్నారు అలా కాకుండా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించినట్లయితే బీసీలకు తీవ్రని అన్యాయం జరుగుతుందని పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని దాని ప్రభావం జాతీయ స్థాయిలో కూడా పార్టీపై ప్రభావం చూపుతోందని తెలిపారు.. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించరాదని దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని అందువల్ల రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు హనుమంతరావు తెలిపారు..
MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..