V.Hanumantha Rao: హాజీపూర్ ఘటన మర్చి పోలేనిదని మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో వాస్తవాలు మాట్లాడారని తెలిపారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించొద్దు అన్నారు.. న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ప్రశ్నించారు. బీజేపీ ఓటమి అంచుల నుండి బయట పడిందని తెలిపారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మెజారిటీ ఉందని ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు.
Read also: Akhilesh Yadav : ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతది.. లోక్ సభలో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
దేశం కోసం వాస్తవాలను మాట్లాడిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు వీహెచ్. ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తెచ్చింది అది మంచిదే అన్నారు. కానీ మూడు చట్టాలు ప్రతి పాక్షలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ప్రతి పక్షాలను అనగదొక్కేందుకే చట్టాలు తెచ్చినట్లు అని పిస్తుందని అన్నారు. హాజీపూర్ లో జరిగిన ఘటన మర్చి పోలేనిదని తెలిపారు. నాలుగు ఏండ్లు అవుతున్న ఆ కేసులో హై కోర్ట్ అప్రోవల్ ఎందుకు ఇవ్వట్లేదన్నారు. నల్గొండ కోర్ట్ కూడా నిదితున్ని శిక్షించాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఐజి శ్రీనివాస్ గుప్తా సీరియస్ గా తీసుకోవాలని కోరారు. హై కోర్ట్ న్యాయ మూర్తికి లేఖ కూడా రాశానని తెలిపారు.
Read also: Harish Rao: పల్లె ప్రగతి మీద ప్రతీ నెలా 3,300 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు చేసింది..
పార్లమెంటులో రాహుల్..
సోమవారం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగం చేశారు. బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘హిందువులమని చెప్పుకునే వారు 24 గంటలూ హింస, ద్వేషం, అబద్ధాలు చెబుతూనే ఉంటారు. వాళ్ళు అస్సలు హిందువులు కాదు. సత్యంతో పాటు నిలబడాలని, ఎప్పుడూ సత్యం నుండి వెనక్కి తగ్గకూడదని హిందూ మతంలో స్పష్టంగా వ్రాయబడింది. అహింస వ్యాప్తి చెందాలి. రాహుల్ ప్రకటనపై ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేయగా, నేను బీజేపీని హింసాత్మకంగా అభివర్ణించానని, నరేంద్ర మోడీది సంపూర్ణ హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోదీజీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. బీజేపీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. ఆర్ఎస్ఎస్ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదన్నారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్