NTV Telugu Site icon

University of Hyderabad: వరల్డ్‌ బెస్ట్‌ యూనివర్సిటీల్లో ఒకటిగా హైదరాబాద్‌ వర్సిటీ.. 7 అంశాలలో..!

Hcu

Hcu

University of Hyderabad: హైదరాబాద్‌ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి.. మార్చి 12వ తేదీన దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ విడుదల చేశారు.. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లోని 1,700 విశ్వవిద్యాలయాల్లో 55 విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు తీసుకున్న 18,300 కంటే ఎక్కువ వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుపై విశ్లేషణతో ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు..

Read Also: SRH Players: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూతురు రిసెప్షన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్ ఆటగాళ్లు.. వీడియో వైరల్!

అయితే, హైదరాబాద్ యూనివర్సిటీ ఏడు సబ్జెక్టులలో ర్యాంక్ పొందింది.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ (251-300), లింగ్విస్టిక్స్ (301-350), సోషియాలజీ (301-375), కెమిస్ట్రీ (451-500), ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ (501-550), ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ (601-675), బయోలాజికల్ సైన్సెస్ (651-700).. ఇలా ఏడు సబ్జెక్టులలో ర్యాంక్స్‌ సొంతం చేసుకుంది.. దీనిపై స్పందించిన యూనివర్సిటీ వైఎస్‌ ఛాన్సలర్ ఫ్రొఫెసర్‌ బీజే రావు.. విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం అన్నారు.. సబ్జెక్టుల వారీగా QS ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం.. ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న విభాగాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు బీజే రావు.. అయితే, మేం మా విజయాలతో సంతృప్తి చెందలేదు. మరిన్ని విషయాలను అందుకోవడానికి.. ఈ ర్యాంకింగ్స్‌లో మా ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. దాని కోసం మేం అవిశ్రాంతంగా పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు హైదరాబాద్‌ యూనివర్సిటీ వీసీ బీజే రావు..