Site icon NTV Telugu

Swetha Suicide: టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్..

Swecha

Swecha

Swetha Suicide: హైదరాబాద్ లోని జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ లో ట్విట్ నెలకొంది. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణ చంద్రరావుతో ఉంటుంది. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేననీ ఇటీవలే పేరెంట్స్ కు ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చినా పూర్ణ చంద్రరావు.. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేశాడు. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య? చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదుతో అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Warangal Horror: ‘క్షమించండి’ అన్నా వినలేదు.. వరంగల్‌లో మహిళపై దారుణ హింస

ఇక, ఎన్టీవీతో స్వేచ్ఛ తల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. స్వేచ్ఛ సూసైడ్ కేసును నిష్పక్షపాతంగా పోలీసు దర్యాప్తు చేయాలని కోరారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణమైన పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పూర్ణ చంద్రరావు మాయమాటలకు బలైంది నా కూతురు.. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి.. పూర్ణచంద్రరావుతో ఉన్న సమస్యను తానే తేల్చుకునేంత ధైర్యవంతురాలు నా కూతురు.. పూర్ణచంద్రరావుతో పెళ్లి విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులకు మేము వివరంగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

Exit mobile version