Site icon NTV Telugu

Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyd

Hyd

Traffic Restrictions: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర రేపు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్ దగ్గర ఈ యాత్ర కొనసాగనుండటంతో.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్ వెల్లడించారు. ఇక, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సెయిలింగ్ క్లబ్.. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వెహికిల్స్ కు పర్మిషన్ లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి అని సూచించారు. కాగా, ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

Read Also: Hair Loss Causes: వంశపారపర్యంగా బట్టతల వస్తుందా? నివేదికలు ఏం చెబుతున్నాయ్?

ఇక, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా బీజేపీ తిరంగ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఈ యాత్ర హైదరాబాద్‌లో కొనసాగనుంది. దీనికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ డీజీపీతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రిటైర్డ్ ఐపీఎల్, డీజీపీ ర్యాంక్ అధికారులు, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది, కళాకారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే ఛాన్స్ ఉంది.

Exit mobile version