NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..

Cm Revanht Reddy

Cm Revanht Reddy

CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనున్నారు.

Read also: Rajanna Sircilla: వారందరికి ఈనెల 27న రిలీవ్.. రాజన్న ఆలయ ఈవో కీలక ప్రకటన..

ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడంపై టీపీసీసీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments