NTV Telugu Site icon

Central Team: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..

Khamma

Khamma

Central Team: వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యక్ష పరిశీలనకు జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరద నష్టాన్ని నేరుగా పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పరిశీలించారు. నష్టాలు భారీగా ఉన్నందున బాధితులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందేలా అన్ని వివరాలు సేకరించి నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విపత్తు కింద ఇచ్చే నిధులను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా బాధితులకు ఖర్చు చేసేందుకు వీలుగా కఠిన నిబంధనలను కూడా సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

Read also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..

ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, మరి కొన్ని జిల్లాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయిన విషయం తెలిసిందే. వరదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయం చేసేందుకు వీలుగా వరద నష్టంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా…రోడ్లు, భవనాల శాఖ కింద రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ కింద రూ.175 కోట్లు, పంటల కింద రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ కింద రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ కింద రూ.170 కోట్లు. , మున్సిపల్ శాఖ కింద రూ.1,150 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. రూ.కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. 2 వేల కోట్లు తక్షణ సాయం. వారం రోజులుగా అతలాకుతలమైన వరదల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో.. అసలు నష్టం మాత్రం ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతే వరద నష్టంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..