బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 690 తగ్గి రూ. 45,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 49, 150 కి చేరింది. ఇక బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి. కిలో వెండి ధర రూ.900 తగ్గి రూ. 69,500 వద్ద కొనసాగుతోంది.
నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు…
