కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద నిలకడగా ఉన్నది. బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధరమాత్రం కొంతమేర పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.73,500కి చేరింది.