NTV Telugu Site icon

గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం ధరలు

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్త‌డి ఆ త‌రువాత తగ్గుతూ వస్తుంది. ఈరోజుకు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.150 తగ్గి రూ.45,350 వ‌ద్ద ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.160 తగ్గి రూ.49,470 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది. బంగారం ధ‌ర‌లు తగ్గగా, వెండి ధ‌ర‌మాత్రం కొంత‌మేర పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.౩౦౦ పెరిగి రూ.76,200కి చేరింది.