కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, నిన్న ఇవాళ మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉండగా… వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ. 75,700 వద్ద కొనసాగుతోంది.