NTV Telugu Site icon

DSC Results 2024: నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..

Telangana Dsc

Telangana Dsc

DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా.. డీఎస్సీ మార్కులతో పాటు టెట్ మార్కులను కూడా ఈ ర్యాంక్ జాబితాలో చేర్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా సాధారణ ర్యాంకు జాబితాను విడుదల చేస్తారు. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత డీఈవోల ఆధ్వర్యంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలు జారీ చేయబడతాయి. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

ఈ ఏడాది మార్చి 1న 11062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించగా.. కొత్త ప్రభుత్వం పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈసారి ప్రభుత్వం తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించింది. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 13న రాష్ట్ర విద్యాశాఖ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదలైంది. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పరీక్షల్లో భర్తీ చేస్తారు.
England vs Australia: ఇంగ్లాండ్ కొంప ముంచిన వరణుడు.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం!