NTV Telugu Site icon

Tirupati Laddu: టీటీడీ అన్ని ఆలయాల్లో తిరుపతి లడ్డూలు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..

Tirupathi

Tirupathi

Tirupati Laddu: హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో కూడా తిరుమల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భాగ్యనగరంలో భక్తులందరికీ లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా వారానికి ఒకసారి మాత్రమే లభించే తిరుపతి లడ్డూను ఇకపై అన్ని రోజులూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని హిమాయత్‌నగర్‌ టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌ ప్రభు, నిరంజన్‌ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని భక్తులకు ఇక నుంచి ప్రతిరోజు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు తెలిపారు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది.

Read also: HYDRA: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు.. జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు..

ఈ లడ్డూ ప్రసాదం రూ.50కే అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూల విక్రయాలు జరిగేవి. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇక మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ రుచి, వాసన, నాణ్యత పెరగనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వ నందిని నెయ్యి వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇటీవల తిరుమలలో భక్తులకు నిత్యం మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా అందజేస్తున్న టీటీడీ తాజాగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి ప్రమాణాలు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Bhatti Vikramarka: వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా అర్ధరాత్రి 1 గంట వరకు బాధితులతో భట్టి ముఖాముఖి

Show comments