NTV Telugu Site icon

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు వద్ద స్పీడ్ అందుకున్న కర్ర పనులు..

Khairatabad Ganesh

Khairatabad Ganesh

ఖైరతాబాద్ వినాయకుడు వద్ద కర్ర పనులు స్పీడ్ అందుకున్నాయి. రేపు ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు 9 గంటలకు మహా హారతి కార్యక్రమం ఉంటుంది.. అనంతరం 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు.. రేపు మంగళవారం కావడంతో సోమవారం రోజులో ఉండగానే మహా గణపతిని కదిలిస్తారు. 12 గంటల తరువాత మహా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు. వెల్డింగ్ పనులు పూర్తి కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. కాగా.. ఉదయాన్నే టస్కర్ వాహనాన్ని 7 గంటలకు కదిలిస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెబుతున్నారు. శోభాయాత్ర పొడువునా వేలాదిగా భక్తులు పాల్గొంటారు. మధ్యాహ్నంలోపే వినాయక సాగర్ కి బడా గణేష్ చేరుకోనున్నాడు. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి, వెల్డింగ్ పనులు నిర్వహించి 2 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

Read Also: Megha Akash: పొలిటికల్ ఫ్యామిలీ కుర్రాడిని లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

మరోవైపు.. బడా గణేష్‌ను దర్శించుకునేందుకు చివరి రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. నగరంలో పెద్ద ఎత్తున గణేష్‌ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్‌ బండ్‌ పైకి తరలి వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గణేశ్ శోభాయాత్ర భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఎల్లుండి సాయంత్రం వరకు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Hyderabad: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

Show comments