Site icon NTV Telugu

KTR Petition: ఏసీబీ కేసు.. కేటీఆర్ పిటిషన్ కాపీలో పేర్కొన్న అంశాలు ఇవే..

Ktr Petistion

Ktr Petistion

KTR Petition: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థ కు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్లో చెప్పారు, కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు FEO పంపడం ఉలంఘన కాదన్నారు. డీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని తెలిపారు.

Read also: Upendra UI Movie Review: ఉపేంద్ర యూఐ రివ్యూ

ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కు ఇది కోనసాగింపు మాత్రమే కేటీఆర్ అన్నారు. దీనికి పీసీ యాక్ట్ కు సంబంధం లేదన్నారు. ఈ అగ్రీమెంట్ ద్వారా వ్యక్తిగతంగా నేను లాభ పడినట్టు ఎక్కడా FIR లో పొందపర్చలేదన్నారు. పొలిటికల్ మైలేజ్, రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేస్ పెట్టారని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అరెస్ట్ లు ఉంటాయని బహిరంగంగానే మంత్రి మాట్లాడారని తెలిపారు. ప్రతి పక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి ఏదో ఒక తప్పుడు కేస్ పెట్టీ అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ముగ్గురు సుప్రీం కోర్టు జెడ్జిమెంట్ లు లలిత కుమార్ vs స్టేట్ ఆఫ్ అప్, చరణ్ సింగ్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రాఘవేందర్ vs ఏపీ స్టేట్ అని పలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లను పిటిషన్ కాపీలో జత పరిచారు.
Minister Seethakka: జైలుకు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు?

Exit mobile version