పెళ్లైన 27 రోజులకే నవవధువు అనుమానస్పద మృతి..

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ కి చెందిన రషీద్‌, షఫియా ఫాతిమా (21) లకు 27 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే ఏంజరిగిందో ఏమో తెలియదు గానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో రషీద్‌ ఇంట్లో ఫాతిమా మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రెయిన్‌బజార్‌ పోలీసులు ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే ఫాతిమా మృతికి భర్త, అత్తమామలే కారణమంటూ ఫాతిమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.